తెలంగాణ

telangana

ETV Bharat / crime

Drugs seized: గుట్టుగా మత్తు పదార్థాల విక్రయం.. నిందితుల అరెస్ట్​ - police arrested drugs selling gang in secunderabad

సికింద్రాబాద్​లో గుట్టు చప్పుడు కాకుండా మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ముగ్గురిని ఆబ్కారీ అధికారులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి కిలో గంజాయి, వాహనాన్ని సాధీనం చేసుకున్నారు.

​ drugs gang arrested
డ్రగ్స్​ ముఠా అరెస్ట్

By

Published : Jul 12, 2021, 7:57 PM IST

సికింద్రాబాద్​లోని లోతుకుంటలో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ముగ్గురిని ఆబ్కారీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కిలో గంజాయి, 10 ఎల్ఎస్డీ ట్యాబ్లెట్లు, 20గ్రాముల హషీష్​ ఆయిల్, 5 గ్రాముల చరస్​తో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న.. బిస్వజిత్ మత్తు పదార్థాలకు అలవాటుపడి తరచుగా గోవా వెళ్తుండేవాడు.

క్రమంగా గోవా నుంచి మత్తు పదార్థాలు తీసుకొచ్చి లోతుకుంట, అల్వాల్, సైనిక్ పురి ప్రాంతాల్లో విక్రయించడం మొదలుపెట్టాడు. బిస్వజిత్ వద్దకు వచ్చే అమర్ చంద్, బ్రియాన్ మార్క్ మత్తు పదార్థాలను కోనుగోలు చేసి ఇతరులకు అధిక ధరలకు విక్రయించేవారు. పక్కా సమాచారం అందుకున్న ఆబ్కారీ అధికారులు.. ముగ్గురినీ అరెస్ట్ చేశారు. వీరి వెనుక ఇంకెవరెవరు ఉన్నారనే దానిపై విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:Baby Dead: భార్యపై అనుమానంతో.. తొమ్మిది నెలల బాలుడి హత్య

ABOUT THE AUTHOR

...view details