సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వడ్డెర కాలనీలో ఉంటున్న లక్ష్మీ తన భర్త నారాయణతో కలిసి కూలీ పని చేసుకుని జీవిస్తుంది. ఈనెల 26వ తేదీన గతంలో పరిచయమున్న తుక్కాపూర్కు చెందిన మేస్త్రీ కృష్ణ వచ్చాడు. తన వరిపొలంలో పని ఉందని నమ్మించి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అతి దారుణంగా గొడ్డలితో తల నరికి చంపాడు.
శివారు ప్రాంతంలో హత్య చేసి... నగలతో ఉడాయించి
పని ఉందని నమ్మించి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి... గొడ్డలితో ఓ మహిళ తల నరికి చంపాడో వ్యక్తి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
శివారు ప్రాంతంలో హత్య చేసి... నగలతో ఉడాయించి
ఆమె వద్దనున్న బంగారం, వెండి ఆభరణాలను తీసుకుని వెళ్లిపోయాడు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా కృష్ణ... లక్ష్మీని తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని... రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి:ప్రియుడితో కలిసి.. భర్త, మామపై హత్యాయత్నం