మహిళా ఆరోగ్య కార్యకర్తలను వేధిస్తున్న సెక్యూరిటీ గార్డును జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గద్వాల మండలం కొండపల్లికి చెందిన నర్సు.. తనను కొద్దిరోజుల నుంచి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్లో వేధిస్తున్నాడని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు .. గతంలో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహించే వ్యక్తే వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిసింది.
మహిళా ఆరోగ్య కార్యకర్తలను వేధిస్తున్న సెక్యూరిటీ గార్డు అరెస్టు - gadwal district crime news
మహిళా ఆరోగ్య కార్యకర్తలను వేధిస్తున్న సెక్యూరిటీ గార్డును జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పేర్లు మారుస్తూ కొంతకాలంగా నర్సులను వేధిస్తున్నట్లు గుర్తించారు.
అతని గురించి మరింత ఆరా తీయగా.. వివిధ పేర్లతో మహిళా ఆరోగ్య కార్యకర్తలకు ఫోన్ చేస్తూ.. అసభ్యకరంగా మాట్లాడేవాడని తేలింది. హైదరాబాద్లోని ఆస్పత్రిలో పని చేస్తున్నప్పుడు.. అక్కడి నర్సులతో పరిచయం పెంచుకుని వారి ఫోన్ నెంబర్లు సేకరించి.. వేధించేవాడని పోలీసులు తెలిపారు. ఆ నర్సులు పోలీసులకు ఫిర్యాదు చేశారని.. రాచకొండ పోలీస్ స్టేషన్లో ఈ నిందితునిపై కేసు నమోదైనట్లు చెప్పారు. సెక్షన్ 354(ఏ) కింద అతనిపై తాజాగా కేసు నమోదు చేసినట్లు గద్వాల ఎస్సై హరిప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
- ఇదీ చదవండి :గుడిసెకు మంటలంటుకొని వృద్ధ దంపతులు సజీవదహనం