drug gangs arrested: హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల సరఫరాపై.. పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు ముఠాలకు చెందిన 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి పెద్ద మొత్తంలో మత్తు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేసిన మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ, నేరేడ్‌మెట్ పోలీసులు.. వారినుంచి 750 గ్రాముల ఓపియం, 500 గ్రాముల పాపిస్ట్రా, ఇన్నోవా కారు స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ ముఠాలపై పోలీసుల పంజా.. పలువురు అరెస్టు - Police seized heroin
drug gangs arrested: హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల సరఫరాపై నగర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తోన్న రెండు ముఠాలకు చెందిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మత్తు పదార్థాలు, ఫోనులు స్వాధీనం చేసుకున్నారు.
drug gangs
పట్టుబడిన సొత్తు విలువ దాదాపు పన్నెండుర లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి మత్తుపదార్ధాలు స్వాధీనం చేసుకున్న నలుగురు సభ్యుల ముఠాను ఎల్బీనగర్ ఎస్‌వోటీ, సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 12 గ్రాముల హెరాయిన్, 4 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: