తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆమె కళ్లలో ఆనందం కోసం.. రైతుల కళ్లల్లో కారం.. కానీ చివరికి..! - కంతేరు గ్రామానికి చెందిన గండం శ్రీనివాసరావు

Businessman Cheating in Guntur District: రైతులకు చెల్లించాల్సిన నగదును తీసుకొస్తుంటే దొంగలు దోచుకున్నారంటూ.. సీన్ క్రియేట్ చేసిన కేసును ఏపీలోని గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు ఛేదించారు. కంతేరు గ్రామానికి చెందిన గండం శ్రీనివాసరావు అనే వ్యక్తి స్థానికంగా ఉన్న రైతులు వద్ద నుంచి పత్తిని కొనుగోలు చేశాడు. మిల్లర్‌ నుంచి నగదు తీసుకొస్తుంటే పెదకాకాని మానస సరోవరం వద్ద ఇరువురు వ్యక్తులు దాడి చేసి 2లక్షలు దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. నగదును తను అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు ఇచ్చి నాటకమాడినట్లు పోలీసులు తెలిపారు.

Businessman Cheating in Guntur District
Businessman Cheating in Guntur District

By

Published : Dec 25, 2022, 8:39 PM IST

Businessman Cheating in Guntur District: వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడు. రైతుల సొమ్మే కదా పోయిందంటే ఎవరు అడగరులే అనే ధైర్యంతో ఓ ప్లాన్​ వేశాడు. రైతులకు చెల్లించాల్సిన నగదును దొంగలు దోచుకున్నారంటూ.. సీన్ క్రియేట్ చేశాడు. ఆ నగదును మహిళకు అందజేశాడు. అనంతరం తన వద్ద నుంచి డబ్బులు దొంగలు కాజేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు శ్రీనివాసరావు అనే వ్యక్తి. రంగంలోకి దిగిన పోలీసులు ఫిర్యాదుదారుడే నిందితుడని తేల్చారు. ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది.

నగదు దోచుకున్నట్లు డ్రామా: కంతేరు గ్రామానికి చెందిన గండం శ్రీనివాసరావు అనే వ్యక్తి స్థానికంగా రైతుల వద్ద నుంచి పత్తిని కొనుగోలు చేసి అమ్ముతూ ఉంటాడని సీఐ సురేశ్​ బాబు తెలిపారు. ఎప్పటిలాగే రైతుల నుంచి సేకరించిన పత్తిని మిల్లుకు అమ్మేశాడు. అనంతం ఈనెల 19న మిల్లర్ వద్ద నుంచి నగదు తీసుకొని.. గ్రామానికి బయలుదేరాడు. తాను డబ్బులతో వస్తుండగా, పెదకాకాని మానస సరోవరం వద్ద ఇద్దరు వ్యక్తులు తనపై దాడి చేసి నగదు దోచుకున్నట్లు డ్రామాను సృష్టించాడని తెలిపారు. అనంతరం రైతులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు.

బాధితున్ని ప్రశ్నించే క్రమంలో కొన్ని అనుమానాలు తలెత్తాయి. మరింత లోతుగా పరిశీలించగా.. సంఘటనా స్థలంలో దాడికి సంబంధించిన ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు. దీంతో ఫిర్యాదుదారుడైన శ్రీనివాసరావుపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించాం. తానే నగదు మరో వ్యక్తికి ఇచ్చి.. మహిళకు అందజేశాడు. -సురేష్​బాబు, సీఐ

మెుత్తంగా తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కోసం.. తనను నమ్మిన రైతులను మోసం చేసేందుకు శ్రీనివాసరావు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వివిద సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ఆ మహిళ ఎవరన్నది విచారణలో తెలియాల్సి ఉంది.

ఆమె కళ్లలో ఆనందం కోసం.. రైతుల కళ్లలో కారం.. కానీ చివరికి..!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details