తెలంగాణ

telangana

By

Published : Aug 10, 2022, 7:17 PM IST

ETV Bharat / crime

లేని కంపెనీ పేరు మీద శాలరీ ఖాతాలు.. క్రెడిట్​ కార్డులు, లోన్లు తీసుకుంటూ మోసాలు

Frauds Arrested: హైదరాబాద్​లో వేర్వేరు కేసుల్లో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బోగస్​ సంస్థ పేరు మీద బ్యాంకు నుంచి లోన్లు తీసుకుని మోసానికి పాల్పడుతున్న కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేయగా.. నకిలీ సర్టిఫికేట్లకు సంబంధించిన కేసులో ఒకరిని.. డ్రగ్స్​ కేసులో మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

police arrested 6 accused in Hyderabad in different frauds
police arrested 6 accused in Hyderabad in different frauds

Frauds Arrested: బ్యాంకుల నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులు తీసుకుని.. వాటి ద్వారా లోన్​లు పొంది.. మోసాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం కోటీ ముప్పై లక్షలు మోసం జరిగిందని రాచకొండ సీపీ మహేశ్​భగవత్​ తెలిపారు. వరంగల్​ జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు బోడ శ్రీకాంత్‌(25).. అతడి స్నేహితులైన బానోత్ సుమన్, నగేశ్​​, గౌతమ్​తో కలిసి రెండేళ్ల క్రితం ఇంటీరియర్ డెకరేషన్ పేరుతో ఓ బోగస్​ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ పేరు మీద.. పలువురు ఉద్యోగులున్నట్టు బ్యాంకు ఖాతాలు తీశారు. ఆ ఖాతాల్లో పెద్ద మొత్తాల్లో జీతాలు వేయటం.. ఒక్కరోజులోనే విత్​డ్రా చేసేవారు. ఆ ఖాతాల మీద డెబిట్​, క్రెడిట్ కార్డులు తీసుకున్నారు. వాటి నుంచి కూడా పూర్తిగా నగదు వాడుకుని.. కొన్ని రోజులు సక్రమంగా కట్టారు. దీని వల్ల క్రెడిట్​ స్కోర్​ పెంచుకుని.. పెద్దఎత్తున లోన్లు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ డబ్బు కట్టుకుండా ఆపేయటంతో.. బ్యాంకు వాళ్లకు అనుమానం వచ్చి పరిశీలించగా.. అసలు మోసం వెలుగుచూసింది. ఇదే విషయమై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

మరోవైపు.. డ్రగ్స్​కేసులో పులిచర్ల శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. శ్రీనివాస్​రెడ్డిపై గతంలోనూ పలు పోలీస్​స్టేషన్లలల్లో కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. మరో నిందితుడు లెనిన్‌బాబుతో కలిసి మెథఫెటామైన్ డ్రగ్‌ను తయారు చేస్తున్నాడని సీపీ వివరించారు. అదే విధంగా.. నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జంగా దయాకర్ రెడ్డి అనే వ్యక్తికి ఎలాగైనా అమెరికా వెళ్లాలని ఆశ. అయితే.. స్టూడెంట్​ వీసాపై వెళ్లాలంటే బీటెక్​లో చాలా సబ్జెక్టులు బ్యాక్​లాగ్స్​ ఉండటం వల్ల అది వీలుకాలేదు. నకిలీ సర్టిఫికేట్లు పెట్టి అమెరికాలో పీజీ చదువుతున్న ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడిని సంప్రదించి.. బీటెక్​లో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేశాడు. హైదరాబాద్​, చెన్నై, ముంబయిలో వీసా ఇంటర్వ్యూకి వెళ్లగా.. మూడింట్లో రిజెక్ట్​ అయ్యాడు. అప్పుడు అసలు విషయం బయటపడింది. పోలీసుల దృష్టికి వచ్చిన వెంటనే దర్యాప్తు చేసి.. నిందితున్ని అరెస్టు చేసినట్టు సీపీ మహేష్‌ భగవత్ వివరించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details