తెలంగాణ

telangana

ETV Bharat / crime

జగిత్యాల జిల్లాలో జోరుగా గంజాయి విక్రయం.. వరసగా రెండో రోజు! - తెలంగాణ వార్తలు

జగిత్యాల జిల్లాలో గంజాయి తరలిస్తున్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా నుంచి జగిత్యాలకు మత్తు పదార్థాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. మాదకద్రవ్యాల దందాపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.

police-arrest-two-accused-due-to-illegal-drugs-scam-in-jagtial-district
జగిత్యాల జిల్లాలో జోరుగా గంజాయి విక్రయం.. వరసగా రెండో రోజు!

By

Published : Mar 17, 2021, 2:19 PM IST

జగిత్యాల జిల్లాలో గంజాయి విక్రయం జోరుగా సాగుతోంది. యువకులు మత్తు పదార్థాలకు అలవాటు పడి డిమాండ్ పెరగడంతో రవాణా ఎక్కువైంది. పక్కా సమాచారంతో రాయికల్‌ మండలం బోర్నపల్లిలో మాదక ద్రవ్యాలను తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే మండలంలో మంగళవారం ఇద్దరిని అరెస్ట్ చేయడం గమనార్హం.

ఆదిలాబాద్‌ జిల్లా నుంచి జగిత్యాలకు మత్తు పదార్థాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. అరెస్ట్ చేసిన ఇద్దరిని రిమాండుకు పంపినట్లు రూరల్‌ సీఐ కృష్ణకుమార్‌ తెలిపారు. వరుసగా రెండు రోజులు గంజాయి పట్టబడటంతో ఈ దందాపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:పని చేసే కంపెనీకే కన్నం వేసిన ప్రబుద్ధుడు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details