తెలంగాణ

telangana

ETV Bharat / crime

land grabbing: తప్పుడు పత్రాలతో ఇంటి స్థలానికి ఎసరు.. చివరకి ఏమైందంటే

land grabbing: తప్పుడు పత్రాలు సృష్టించి ముగ్గురు మహిళలు విలువైన ఇంటి స్థలాన్ని కాజేసారు. ఏకంగా తామే హక్కుదారులమని బిల్డప్​ ఇచ్చారు. అంత వరకు బాగానే ఉన్న ఇక్కడే కథ కాస్త అడ్డం తిరిగింది. ఆ స్థలంకు సంబంధించిన వారు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. చివరకి వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మహిళల ఆటకట్టించారు. ఈ ఘటన ఉప్పల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

three woman for land grabbing
తప్పుడు పత్రాలు సృష్టించిన మహిళలు

By

Published : Feb 26, 2022, 10:58 AM IST

land grabbing: తప్పుడు పత్రాలతో విలువైన ఇంటి స్థలం కాజేసిన ముగ్గురు మహిళలను హైదరాబాద్ ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సరూర్‌నగర్‌ ఆర్​కే పురానికి చెందిన పచ్చిపులుసు వరలక్ష్మి కుమారి(71)కి రామంతాపూర్ శ్రీరమణ పురంలో 276గజాల ఇంటి స్థలం ఉంది. ఆమె భర్త మల్లికార్జున రావు 2011లో చనిపోవడంతో అప్పటి నుంచి ఆమె సోదరుడు మల్లేశ్వర రావు ఇంటి స్థలాన్ని చూసుకుంటున్నారు.

చర్చి కాలనీలో ఉండే పసల జ్యోతితో పాటు మరి కొందరికి ఈ స్థలంపై కన్ను పడింది. దీంతో వరలక్ష్మి మృతి చెందినట్లు 2014 లో మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించారు. ఏకంగా ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇటీవల వరలక్ష్మికి సంబంధించిన వారు రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బయ్యారం గ్రామ పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి మరణ ధృవీకరణ పత్రం ఇచ్చినట్లు సబ్​రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించింది నకిలీదని పోలీసులు తెల్చారు. దీని కోసం వారు పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రధాన నిందితురాలు జ్యోతి, బల్ల‌జ్యోతి, పసల వెన్నెల అదుపులోకి తీసుకున్నారు. మరో 9 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:ఎకరం భూమితో ఘరానా మోసం.. ఫ్యామిలీ మొత్తం అరెస్ట్!

ABOUT THE AUTHOR

...view details