తెలంగాణ

telangana

ETV Bharat / crime

Murder attempt case: అత్తామామలపై హత్యాయత్నం కేసు.. ముగ్గురు అరెస్ట్ - తెలంగాణ వార్తలు

కూకట్​పల్లిలో అత్తామామలపై హత్యాయత్నం(Murder attempt case) కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సాయికృష్ణకు సహకరించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. భార్యను దూరం చేసి కేసు పెట్టించారని భావించిన ఓ వ్యక్తి... ఈ దారుణానికి పాల్పడ్డాడు.

Murder attempt case, kukatpally murder attempt case
కూకట్​పల్లి హత్యాయత్నం కేసు, హత్యాయత్నం కేసులో అరెస్ట్

By

Published : Oct 11, 2021, 3:59 PM IST

కూకట్‌పల్లిలో వృద్ధ దంపతులపై హత్యాయత్నం(Murder attempt case) కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సాయికృష్ణకు సహకరించిన అతని తండ్రి, స్నేహితుడు, కారు డ్రైవర్​ను అరెస్టు చేశారు. ఈనెల 9న రాత్రి కూకట్​పల్లిలో నివాసం ఉంటున్న అత్త, మామపై సాయికృష్ణ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. సాయికృష్ణ, అతని తల్లి మాధవీలత కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన వృద్ధ దంపతులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఏం జరిగింది?

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో తమ కూతురిని వేధిస్తున్నారని కేసు పెట్టిన కారణంగా అత్తమామలపై అల్లుడు సాయికృష్ణ పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. 2016లో నిఖిత, సాయికృష్ణలు ప్రేమించి వివాహం చేసుుకన్నారు. కొన్ని రోజుల తర్వాత వేధింపులకు గురిచేస్తున్నాడంటూ... సాయికృష్ణపై తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యను దూరం చేసి కేసు పెట్టించారని భావించిన సాయికృష్ణ... శనివారం అత్తగారింటికి వచ్చి వారితో వాగ్వాదానికి దిగాడు. వెంట తెచ్చిన పెట్రోల్ పోసి నిప్పంటించటంతో..... సాగర్‌రావు, రమాదేవిలు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:వృద్ధ దంపతులపై పెట్రోల్​ పోసి నిప్పు.. అల్లుడే చేశాడా?

ABOUT THE AUTHOR

...view details