తెలంగాణ

telangana

ETV Bharat / crime

రెమ్​డెసివిర్ ఇంజెక్షన్లు అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్ - తెలంగాణ వార్తలు

రెమ్​డెసివిర్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 సెల్​ఫోన్లు, 6 ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

police arrest three members, Remdesivir injections illegal sales
ముగ్గురు వ్యక్తులు అరెస్ట్, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అక్రమ విక్రయం

By

Published : May 22, 2021, 8:39 AM IST

హైదరాబాద్ ఓయూ పీఎస్​ పరిధిలోని తార్నాకలో రెమ్​డెసివిర్ ఇంజెక్షన్లను రూ.30,000 చొప్పున విక్రయిస్తున్న అమర్​నాథ్, గోవింద్, రాములు అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 సెల్ ఫోన్లు, 6 రెమ్​డెసివిర్ (4 హెటిరో, 2 రెడ్డీస్) ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఓయూ సీఐ రమేశ్ నాయక్ వెల్లడించారు.

లాక్​డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నవారిపై 205 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ద్విచక్రవాహనాలు 26, కారులు 1, మాస్కులు లేని 12 మందిపై కేసు నమోదైందని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎస్సై గంగాధర్, ఎస్సై అనిల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details