రోడ్డుపై జరిగిన చిన్న ప్రమాదంలో మాట్లాడేందుకు వెళ్లిన వ్యక్తిని అతికిరాతకంగా హత్య చేసిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. మేడ్చల్-మల్కాజిరిగి జిల్లా జగద్గిరిగుట్ట దావూద్ బస్తీలో నివాసముండే అజిజ్, జావేద్ అనే ఇద్దరు ఈ నెల 14న విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఇంటికి సమీపంలో ఓ చిన్నారి(4) వారి ద్విచక్రవాహనానికి అడ్డువచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు.
murder case: 'చిన్న ప్రమాదం.. చివరకు హత్య' - తెలంగాణ వార్తలు
జగద్గిరిగుట్టలో చిన్న ప్రమాద ఘటనపై మాటా మాటా పెరిగి చివరకు హత్యకు దారి తీసిందని జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపారు. జావేద్ అనే వ్యక్తిని అతికిరాతంగా హతమార్చారని పేర్కొన్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
అనంతరం శ్రీహరి అనే యువకుడు ఈ ఘటనపై మాట్లాడేందుకు ద్విచక్రవాహనదారుడు అజిజ్ ఇంటికి వచ్చి దాడికి యత్నించాడని వెల్లడించారు. అదేరోజు సాయంత్రం మృతడు జావేద్, శ్రీహరితో మాట్లాడేందుకు ఆయన ఇంటికి వెళ్లాడని తెలిపారు. అక్కడ మాటమాట పెరిగి క్షణికావేశంలో జావేద్‌ను శ్రీహరి కత్తితో అతికిరాతకంగా పొడిచి హత్య చేశాడని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని... శ్రీహరితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరు జుబేర్, విజయ్‌లను నేడు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:నేడు కేబినెట్ అత్యవసర భేటీ.. లాక్డౌన్ తొలగింపు?