వాహనదారులను లిఫ్ట్ అడుగుతారు. మాటల్లో పెట్టి వారి మెడలోని బంగారు గొలుసు లాక్కొని(chain snatching) చెక్కేస్తారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ట్రాన్స్‌జెండర్‌తో పాటు మరో వ్యక్తిని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బంగారు గొలుసు, లాప్‌టాప్, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూరుకు చెందిన అంజుమ్ 8ఏళ్ల క్రితం ట్రాన్స్‌జెండర్‌గా(transgender woman arrested) మారింది. హైదరాబాద్‌కు తన అనుచరుడు బస్వరాజ్‌తో కలిసి చేరుకుంది. సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో బస చేసింది.
ఈజీ మనీ కోసం..
సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన అంజుమ్... వాహనదారులను లిఫ్ట్ అడిగేదని పోలీసులు తెలిపారు. ఎవరైనా లిఫ్ట్ ఇస్తే చాలు... మాటల్లో పెట్టి వాహనదారుల మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరారయ్యేవారని వెల్లడించారు. ఈ నెల 12న రాత్రి ప్యారడైజ్ సర్కిల్‌లో కారులో వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగిందని... కారులో ఎక్కిన తర్వాత ఆ వ్యక్తితో అసభ్యంగా ప్రవర్తించడంతో... వాహనదారుడు అంజుమ్‌ను కారు దింపేశాడని తెలిపారు. ఈ క్రమంలో అతని మెడలోని బంగారు గొలుసు, ల్యాప్‌టాప్ లాక్కొని పరారైందని వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.
బేగంపేటలో మరో ద్విచక్రవాహనదారుడిని లిఫ్టు అడిగి బంగారు గొలుసును దొంగిలించింది. గురువారం లాడ్జిలో ఉన్న అంజుమ్, బసవరాజును అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.