Rape on Minor Girl at karkhana : ప్రేమ పేరుతో బాలికను లొంగదీసుకొని... ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన ఇద్దరు వ్యక్తులపై కార్ఖానా పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్కు తరలించారు. మలక్పేట్ ప్రాంతానికి చెందిన ఆమన్ ఖాన్(26) ప్రైవేట్ ఉద్యోగి. అతడికి కార్ఖానాకు చెందిన ఓ బాలిక స్నాప్ చాట్ ద్వారా పరిచయమైంది. తరుచూ మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మించాడు.
Hyderabad rape case : హైదరాబాద్ నగరంలోని రెండు హోటళ్లలో పనిచేసే ఇద్దరు ఉద్యోగుల ద్వారా... రూములు అద్దెకు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. అలా మైనర్పై రెండు సార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడని వెల్లడించారు. బాలిక కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో... పోలీసులను ఆశ్రయించారు.