తెలంగాణ

telangana

ETV Bharat / crime

డ్రగ్స్​ కేసులో పోలీసుల దర్యాప్తు.. లక్ష్మీపతి నెట్‌వర్క్‌పై ఆరా.! - btech student died in drugs addiction

Drugs Case in Telangana: రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు.. డ్రగ్స్​కు బానిసై విద్యార్థి మృతి చెందడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్​ సంబంధిత కేసుల్లో కీలక సూత్రధారిగా ఉన్న లక్ష్మీపతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అదేవిధంగా మత్తు బాధితులను గుర్తించే పనిలో పడిన పోలీసులు.. గోవా వెళ్లొచ్చే వారిపై నిఘా పెట్టారు.

Drugs Case in Telangana
తెలంగాణలో డ్రగ్స్​ కేసు

By

Published : Apr 1, 2022, 11:36 AM IST

Drugs Case in Telangana: డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో ఉన్న గంజాయి వ్యాపారి లక్ష్మీపతి కోసం నార్కోటిక్స్‌ పోలీసులు గాలిస్తున్నారు. మూడు ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. లక్ష్మీపతిపై ఉన్న పాత కేసుల వివరాలు రాబడుతున్నారు. లక్ష్మీపతి నెట్‌వర్క్‌పైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. అతనితో కాంటాక్ట్‌లో ఉన్న విద్యార్థుల వివరాలపైనా దృష్టిపెట్టారు. గోవా నుంచి డ్రగ్స్, విశాఖ నుంచి హాష్‌ఆయిల్ తెచ్చి లక్ష్మీపతి విక్రయిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ బాధితులను గుర్తించే పనిలో ఉన్న పోలీసులు.. గోవా వెళ్లి వచ్చే వాళ్లపైనా నిఘా పెట్టారు.

డ్రగ్స్‌కు బానిసైన బీటెక్‌ విద్యార్థి మృతి చెందడం హైదరాబాద్‌లో కలకలం రేపింది. రెండ్రోజుల క్రితం జూబ్లీహిల్స్‌, నల్లకుంట పరిధిలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నల్లకుంట పరిధిలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ప్రేమ్‌ ఉపాధ్యాయ్‌ను అరెస్టు చేశారు. ప్రేమ్‌ ఉపాధ్యాయ్‌తో పాటు డ్రగ్స్‌ వినియోగిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. నలుగురు వ్యక్తులు తరచూ గోవా వెళ్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. నలుగురితో కలిసి బీటెక్‌ విద్యార్థి గోవా వెళ్లి.. డ్రగ్స్‌ తీసుకుంటుండగా మోతాదు ఎక్కువై మృతి చెందాడని గుర్తించారు. నిందితుల నుంచి 6 ఎల్ఎస్డీ బోల్ట్స్, 10 పిల్స్, 100గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.

మరో కేసులో జూబ్లీహిల్స్‌లో శ్రీరామ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. బీటెక్​ చదివే సమయంలో మత్తుపదార్థాలకు బానిసై.. ఉద్యోగం లేక జులాయిగా తిరుగుతున్న శ్రీరామ్​.. ఇంటినే ల్యాబ్​గా మార్చి.. డ్రగ్స్​ను తయారుచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని వద్ద డ్రగ్స్‌ వినియోగిస్తున్న దీపక్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 8 గ్రాముల డీఎంటీ డ్రగ్, తయారీ సామగ్రి, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో లక్ష్మీపతి కీలక నిందితుడిగా భావిస్తున్న పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి:'హై-డోస్​ డ్రగ్స్​తో సెకన్లలో చనిపోయే ప్రమాదముంది'

ABOUT THE AUTHOR

...view details