రెస్టారెంట్లకు, హోటళ్లకు కస్టమర్లను ఆకర్షించేందుకు వినసొంపైన సంగీతం, ఆకర్షణీయమైన వంటకాలు, సకల సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లుగా.. పేకాట శిబిరాలకు ప్రముఖులను ఆకర్షించేందుకు రుచికరమైన వంటలను గుత్తా సుమన్(Manchirevula farm house case) ఏర్పాటు చేస్తాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలోని మంచిరేవుల ఫామ్ హౌస్ పేకాట కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్(Manchirevula farm house case)ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల కస్టడీలో భాగంగా చర్లపల్లి జైలు నుంచి గుత్తా సుమన్‌ను కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు.... ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నార్సింగి ఠాణా తీసుకొచ్చి అక్కడి నుంచి మాదపూర్ ఎస్ఓటీ కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు.
రుచికరమైన వంటకాలతో
పేకాట కేసులో గుత్తా సుమన్... నిర్వహణ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు నార్సింగి పోలీసుల ప్రాథమిక దర్యాప్తు(Manchirevula farm house case)లో తేలింది. ప్రముఖులను ఆకర్షించడానికి పలు రుచికరమైన వంటలతో పాటు... చేపల కూర వెరైటీలను భోజనంలో వడ్డిస్తాడని... పేకాట శిబిరంలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడని పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు. సుమన్‌పై గచ్చిబౌలి పీఎస్‌లోనూ పేకాట కేసు(Manchirevula farm house case) నమోదైంది. పంజాగుట్ట, కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లలో మోసం చేసిన కేసులు నమోదయ్యాయి. ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలోనూ సుమన్‌పై కేసులున్నాయి.