రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణిల హత్యకు సంబంధించిన విషయాలు మాట్లాడుకున్న ఇద్దరు వ్యక్తులను పెద్దపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గోదావరిఖని ఏసీపీ వివరాలు వెల్లడించారు.
వామన్రావు దంపతుల హత్యపై మాట్లాడుకున్న ఇద్దరిపై పోలీసుల చర్యలు - peddapalli district crime news
న్యాయవాద దంపతులు వామన్రావు-నాగమణిల హత్య గురించి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న సంభాషణ పెద్దపల్లి జిల్లాలోని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
గోదావరిఖని ఏసీపీ
మంథని మండలం పోతారం గ్రామ సర్పంచ్ భర్త జాగిరి సదానందం, మంథని పట్టణానికి చెందిన పురుషోత్తంరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు న్యాయవాద దంపతుల హత్య గురించి చర్చించిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా తప్పుగా మాట్లాడినట్లు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు. తప్పుడు సమాచారంతో ప్రజలు, యంత్రాంగాన్ని భయాందోళనకు గురిచేసే చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.