దీపావళి పూట అందరూ.. పటాకులు పేల్చుకుంటూ ఆనందంగా ఉంటే.. కొందరు మాత్రం పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. ఒకరిద్దరు కాదు.. ఏకంగా ముప్పై మంది దాకా.. పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ ఇమాంపురంలోని పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. గురువారం రాత్రి.. పేకాట ఆడుతున్నారన్న కచ్చితమైన సమాచారంతో పోలీసులు దాడి చేశారు.
పండుగ పూట అడ్డంగా దొరికిపోయిన పేకాటరాయుళ్లు... - Poker players in hyderabad
పేకాట స్థావారాలపై పోలీసులు దాడి చేశారు. 26 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల నుంచి 52 వేల నగదు, చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
Poker players caught in imampur on diwali
బీరువాలు తయారు చేసే ఓ కర్ఖానాలో.. ఏకంగా 26 మంది పేకాట ఆడుతున్నారు. పూర్తిగా ఆటలో మునిగిపోయిన పేకాట రాయుళ్లు.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. అందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి దగ్గర నుంచి 52 వేల నగదుతో పాటు అందరి చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: