తెలంగాణ

telangana

ETV Bharat / crime

పేకాట స్థావరంపై దాడి.. ఎనిమిది మంది అరెస్టు - తెలంగాణ క్రైం వార్తలు

వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామ శివారులో జరిగింది.

playing cards at inavolu Eight members arrested
పేకాట స్థావరంపై దాడి.. ఎనిమిది మంది అరెస్టు

By

Published : Mar 8, 2021, 2:53 AM IST

వరంగల్ రూరల్ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామ శివారులో ఎనిమిది మంది పేకాట రాయుళ్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించారు.

ఆ దాడుల్లో 35 వేల రూపాయల నగదు, ఒక స్వైపింగ్ మిషన్, ఓ కారు, మూడు ద్విచక్ర వాహనాలను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో ఒకరు జఫర్ గడ్ మండలానికి చెందిన క్యాత శంకర్ పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు టాస్క్​ఫోర్స్ సీఐ నంధీరామ్ నాయక్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీని తదుపరి చర్యల నిమిత్తం ఐనవోలు పోలీసులకు అప్పగించినట్లు వారు వివరించారు.

ఇదీ చూడండి :వాహనం పల్టీ.. ఇద్దరు మృతి, మరో ఏడుగురికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details