తెలంగాణ

telangana

ETV Bharat / crime

Kuwait Murders Case : 'ఆ హత్యలతో నా భర్తకు ఎలాంటి సంబంధం లేదు' - AP man involved in Triple Murders in Kuwait

Kuwait Murders Case : కువైట్​లో జరిగిన హత్యల కేసులో తన భర్తను అన్యాయంగా ఇరికించారని వెంకటేశ్​ భార్య స్వాతి పేర్కొంది. బతుకుదెరువు కోసం ఆ దేశం వెళ్లామని.. ఎలాంటి తప్పు చేయలేదని.. తన భర్తను కువైట్ నుంచి ఇండియాకు రప్పించాలని కన్నీటిపర్యంతమయ్యారు. కువైట్ నుంచి స్వస్థలానికి తిరిగొచ్చిన స్వాతి.. ఈ మేరకు కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Kuwait Murders Case
Kuwait Murders Case

By

Published : Mar 11, 2022, 9:57 AM IST

Kuwait Murders Case : కువైట్​లో జరిగిన మూడు హత్యలకు తన భర్త వెంకటేశ్​కు ఎలాంటి సంబంధం లేదని.. కువైట్ నుంచి స్వస్థలానికి వచ్చిన వెంకటేశ్​ భార్య స్వాతి అన్నారు. ఈ మేరకు కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం కువైట్ నుంచి ఇండియాకు వచ్చిన పిల్లొళ్ల స్వాతి.. దిన్నెపాడు కస్పాలోని ఇంటికి చేరారు. అనంతరం.. ఏ తప్పు చేయని తన భర్తను ఎలాగైనా కాపాడాలని లక్కిరెడ్డిపల్లె పోలీసులను ఆశ్రయించారు.

ఆ హత్యలతో నా భర్తకు ఎలాంటి సంబంధం లేదు

Triple Murders in Kuwait : 'కువైట్​లో షెఠ్, అతని భార్య, కూతుర్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వేరే ఇంట్లో డ్రైవర్​గా పని చేస్తున్న తన భర్త వెంకటేశ్​పై కేసు పెట్టి అన్యాయంగా ఇరికించారు. బతుకు తెరువు కోసం కువైట్​ వెళ్లాం. అక్కడ జరిగిన మూడు హత్యలతో నా భర్తకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరో చేసిన హత్యలకు తన భర్తను శిక్షించడం ఎంతవరకు న్యాయం' అని స్వాతి కన్నీటి పర్యంతమయ్యారు.

Kuwait Murders Case Updates : తన భర్తను కువైట్ నుంచి ఇండియాకు రప్పించాలని.. అతను ఎలాంటి నేరాలు చేయలేదని జిల్లా కలెక్టర్​ను కలిసి తమ గోడు విన్నవించుకుంటామని స్వాతి చెప్పారు. తన భర్తను ఎలాగైనా కాపాడాలని జిల్లా ఉన్నతాధికారులను ఆమె వేడుకున్నారు. కాగా.. కువైట్​లో జరిగిన హత్య ఘటనపై జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆరా తీస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details