తెలంగాణ

telangana

ETV Bharat / crime

కలుషితాహారం తిని.. 25 మందికి అస్వస్థత - pilgrims fell ill at srisailam news

120 మంది గ్రామస్తులు... పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్​లోని శ్రీశైలం వెళ్లారు. అక్కడకు చేరుకున్న అనంతరం వారి వెంట తెచ్చుకున్న భోజనం తిని.. కబుర్లు చెప్పుకొని నిద్రలోకి జారుకున్నారు. ఇంతలో ఏమయ్యిందో ఏమో.. 25 మందికి వాంతులు, విరేచనాలు మెుదలయ్యాయి.

pilgrims-at-srisailam-fell-ill-after-eating-food-they-bought
కలుషితాహారం తిని.. 25 మందికి అస్వస్థత

By

Published : Mar 4, 2021, 12:27 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీశైల మహాక్షేత్రంలో 25 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఆ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం నెరంజమ్ పల్లెకు చెందిన.. 120 మంది భక్తులు శ్రీశైలం దర్శనానికి వెళ్లారు. అనంతరం వారి వెంట తెచ్చుకున్న.. భోజనం తిని నిద్రపోయారు.

తెల్లవారుజామున 3.30 సమయంలో 25 మందికి వాంతులు, విరేచనాలు మెుదలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్​లో ప్రాజెక్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఒకరికి రక్త విరేచనాలు కావటంతో.. కర్నూలుకు తరలించారు. మిగిలిన వారంతా.. సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి:తెలంగాణలో 1,948 యాక్టివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details