కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఫోన్ చోరీ జరిగింది. హోటల్లో ఛార్జింగ్ పెట్టిన చరవాణిని ఎత్తుకెళ్లాడు. భోజనానికి వచ్చినట్లుగా ప్రవేశించి.. ఎవరూ లేకపోవడంలో చక్కగా జేబులో పెట్టుకొని ఉడాయించాడు. అయితే అక్కడ సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. కానీ ముఖానికి మాస్క్ ధరించడం వల్ల నిందితున్ని సరిగా గుర్తుపట్టలేకపోతున్నారు.
ఫోన్ కాజేశాడు.. సీసీ కెమెరాలకు చిక్కాడు - telangana crime news
హోటల్లో భోజనానికి వచ్చినట్లుగా ప్రవేశించి.. అక్కడ ఛార్జింగ్ పెట్టిన ఫోన్ కాజేశాడు ఓ వ్యక్తి.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్డాంట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు నమోదయ్యాయి.
ఫోన్ కాజేశాడు.. సీసీ కెమెరాలకు చిక్కాడు
బాధితుని ఫిర్యాదులో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఫోన్ల దొంగతనాలు తరచూ జరుగుతున్నాయని.. చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.