అటవీ అధికారిపై పెట్రోల్ పోసిన పోడు వ్యవసాయదారులు - తెలంగాణ వార్తలు
19:21 September 16
అటవీ అధికారిపై పెట్రోల్ పోసిన పోడు వ్యవసాయదారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అటవీ అధికారులపై పోడు సాగుదారులు పెట్రోల్ పోశారు. పోడు భూముల్లో మొక్కలు చూసేందుకు వెళ్లిన అటవీ అధికారులపై దాడికి దిగారు. అటవీ రేంజ్ అధికారిణి దివ్య, సిబ్బందిపై పెట్రోల్ పోశారు. తమ భూముల్లో మొక్కలు నాటవద్దంటూ పోడు సాగుదారుల నిరసన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం పోడు భూముల్లో అధికారులు మొక్కలు నాటారు. అధికారులు నాటిన మొక్కలు పోడు సాగుదారులు తొలగించారు. పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీ సిబ్బంది అక్కడికి వెళ్లారు.
ఇదీ చదవండి: కోహ్లీ కీలక నిర్ణయం.. టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై