CI Nageshwar Rao Case Update: హైదరాబాద్ వనస్థలీపురంలో సీఐ నాగేశ్వర్‌రావును కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. నాగేశ్వర్రావు మీద వచ్చిన ఆరోపణలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో సాంకేతికంగా ఆధారాలు సేకరించినట్లు సీపీ స్పష్టం చేశారు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.
సీఐ నాగేశ్వర్‌రావును కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్..
CI Nageshwar Rao Case Update: సీఐ నాగేశ్వరరావు కేసు దర్యాప్తు వేగవంతంగా సాగుతోందని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ తెలిపారు. ఇప్పటికే పలు ఆధారాలు సేకరించినట్టు స్పష్టం చేసిన సీపీ.. నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు.
"సీఐ నాగేశ్వర్రావు కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. 164 స్టేట్మెంట్ రికార్టు చేయాల్సి ఉంది. పోలీస్ కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంది. అందుకోసం పిటిషన్ దాఖలు చేశాం. ఇప్పటికే.. సీసీటీవీ ఫుటేజీని తీసుకున్నాం. బాధితురాలితో సాంకేతిక ఆధారాలు సేకరించాం. ఆరోగ్య పరీక్షలు అయ్యాయి. ఇంకా కొందరు సాక్ష్యులు ముందుకు వస్తున్నారు. వాళ్ల స్టేట్మెంట్స్ కూడా తీసుకుంటున్నాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దర్యాప్తు పూర్తి చేసి.. ఛార్జిషీట్ ఫైల్ చేస్తాం. ఇంకా ఏవరైనా బాధితులుంటే.. ధైర్యంగా ముందుకు రావాలి. భయపడాల్సిన అవసరం లేదు." - మహేశ్‌భగవత్, రాచకొండ సీపీ
ఇవీ చూడండి: