కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి రాజీవ్ రహదారిలో ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు అతివేగంతో దూసుకొచ్చి సైకిల్, ద్విచక్ర వాహనాన్ని తగిలి... రోడ్డు పక్కనే నిలిచి ఉన్న ఆటోను ఢీకొట్టగా ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో పెనుప్రమాదం తప్పగా ద్విచక్రవాహనదారుడితోపాటు ఆటోలో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు 108 సహాయంతో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆటోను ఢీకొన్న కారు.. పలువురికి తీవ్ర గాయాలు - road accident at karimnagar ganneruvaram mandal
అతివేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు పక్కనే నిలిచి ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ ద్విచక్రవాహనదారుడు, ఆటోలో ఉన్న ప్యాసింజర్లకు తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి రాజీవ్ రహదారిలో ప్రమాదం చోటు చేసుకుంది.
ఆటో డ్రైవర్ కుమార్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న వాహనదారుల నుంచి క్షేత్రస్థాయి మార్పు రావడం లేదు. మితిమీరిన వేగంతో వాహనాలను నడపడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారితో పాటు ఇతరులకు ప్రాణ నష్టం వాటిల్లుతోంది. మరిన్ని కఠిన చర్యలు చేపడితే గాని వాహనదారుల్లో మార్పు రాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు.