మద్యం మత్తులో ఉన్న బావను.. తలపై బలంగా కొట్టి చంపి పారిపోయాడో బావమరిది. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలంలో జరిగిందీ ఘటన. లింగాపూర్ గ్రామానికి చెందిన దుర్గయ్య.. కొద్ది రోజుల నుంచి వ్యక్తి గత కారణాలతో భార్యతో తరచూ గొడవ పడేవాడు. అక్క భర్త రాజు.. గొడవ విషయంలో అతనికి కాకుండా అతని భార్యకు సపోర్ట్‌గా మాట్లాడేవాడు. అది చూసి తట్టుకోలేకపోయిన దుర్గయ్య.. బావను చంపాలని పథకం రచించాడు.
బావను హతమార్చి.. పరారైన బావమరిది - సంగారెడ్డి వార్తలు
బావ మంచే కొరతాడు బావమరిది. ఇక్కడ మాత్రం చావును కోరాడో వ్యక్తి. నిద్రిస్తున్న బావ తలపై కట్టెలతో కొట్టి చంపాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలంలో జరిగింది.
person who killed Brother in law
రాజుకు అర్ధరాత్రి దాకా మద్యం తాగిపించి.. అతడు పడుకున్నాక తలపై కట్టెతో బలంగా కొట్టాడు. అక్కడికక్కడే ప్రాణాలొదిలిన బావను చూసి.. దుర్గయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి:బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
Last Updated : May 7, 2021, 1:20 PM IST