Murder at cemetery ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని శ్మశానంలో చంపిన ఘటన కలకలం రేపింది. గుప్తనిధులకోసమే హత్య చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువు మరవ పల్లికి సమీపంలోని శ్మశానవాటికలో నాగార్జున రెడ్డి అనే వ్యక్తిని బండరాళ్లతో మోది కిరాతకంగా హత్య చేశారు.
హత్య జరిగిన ప్రదేశానికి సమీపంలో ముగ్గులు వేయడంతో పాటుగా, పూజలు చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దాంతో గుప్తనిధుల కోసమే నాగార్జున రెడ్డిని హతమార్చినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. హత్య విషయం తెలుసుకున్న కదిరి గ్రామీణ సీఐ శివ శంకర్ నాయక్, తలుపుల ఎస్సై శరత్చంద్ర ఘటనా స్థలికి చేరుకుని డాగ్ స్క్వాడ్‌కు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.