తెలంగాణ

telangana

ETV Bharat / crime

blackmailing: ఆన్​లైన్​ పరిచయం... ఫోటోలతో మోసం చేసేందుకు యత్నం - బ్లాక్ మెయిల్

ఇన్​స్టాగ్రాంలో మాటలు కలిపి బాలికతో చనువు పెంచుకున్నాడు. దగ్గరగా ఉంటూ అమ్మాయి ఫోటోలు తీసి... బ్లాక్​మెయిల్​ చేయడం ప్రారంభించాడు. వేధింపులు తట్టుకోలేని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత ఏమైందంటే..

blackmail
ఆన్​లైన్​ పరిచయం

By

Published : Aug 20, 2021, 2:16 PM IST

నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండలం సిద్ధపూర్​కు చెందిన యువకుడు... ఎడ్లపల్లిలోని బాలికకు ఇన్​స్టాగ్రాం ద్వారా పరిచయమయ్యాడు. ఫ్రెండ్​షిప్​ అంటూ చనువుగా మాట్లాడి.. ఆమె ఫోటోలు తీశాడు. తర్వాత వాటిని మార్ఫింగ్​ చేసి బ్లాక్​మెయిల్ చేయడం ప్రారంభించాడు. వేధింపులు తట్టుకోలేని బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

విచారణ జరిపిన ఎడ్లపల్లి పోలీసులు సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసుకున్నారు. నిన్న అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. రాత్రికావడంతో పోలీస్​ కస్టడీలో ఉంచారు. తెల్లవారుజామును పోలీసుల కళ్లుగప్పి ఆ వ్యక్తి అక్కడినుంచి పారిపోయాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఎస్సై ఎల్లాగౌడ్​తో పాటు... పోలీస్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిందితున్ని పట్టుకొనేందుకు ప్రత్యేక పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి.

సామాజిక మాధ్యమాల్లో పరిచయమయ్యే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. వారితో చనువు పెంచుకునే ముందు ఎలాంటి వారో తెలుసుకుని మసులుకోవాలంటున్నారు.

ఇదీ చూడండి:సోషల్ మీడియాలో ప్రతి నిమిషానికి ఏం జరుగుతోంది?

ABOUT THE AUTHOR

...view details