జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో అనుమానస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రోడ్డు పక్కన మృతదేహాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.
అనుమానాస్పద స్థితిలో ఐస్ క్రీం వ్యాపారి మృతి - person died in jayashankar bhupalapally news
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమైంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
మృతుడు కాకతీయ కాలనీకి చెందిన ఐస్ క్రీం వ్యాపారి రేణుకుంట్ల కృష్ణ(25)గా పోలీసులు గుర్తించారు. మృతికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.
ఇదీ చదవండి:మత్తు పదార్థాలకు బానిసై యువకుడు ఆత్మహత్య