హోలీ వేడుకల అనంతరం కోనేరులో స్నానానికి దిగి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మహేశ్(22) సోమవారం హోలీ ఆడిన తరువాత.. స్నానం చేయడానికి బుగ్గ రామేశ్వరాలయానికి వెళ్లాడు. అక్కడ కోనేరులో స్నానం చేయడానికి దిగిన మహేశ్.. ఈత రాకపోవడం వల్ల నీటిలో మునిగి చనిపోయాడు.
కోనేరులో మునిగి యువకుడు మృతి - వికారాబాద్ వార్తలు
అప్పటివరకు ఎంతో సంతోషంగా హోలీ ఆడుకున్నాడు. అనంతరం స్నానానికి కోనేరుకు వెళ్లాడు. ఈత రాకపోవడం వల్ల అందులోనే మునిగి ప్రాణాలొదిలాడు. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది.
![కోనేరులో మునిగి యువకుడు మృతి vikarabad, holi news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11211907-958-11211907-1617097839087.jpg)
హోలీ వార్తలు, వికారాబాద్ వార్తలు
మహేశ్ ఎంతకీ ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు రాత్రి నుంచి వెతికారు. ఈ రోజు ఉదయం కోనేరు వద్ద మహేశ్ బట్టలని కుటుంబీకులు గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసి.. వికారాబాద్ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: క్షుద్రపూజల ఉదంతంలో అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం