నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో 167 వ జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వెనుక నుంచి వస్తున్న బస్సు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పట్టణ పరిధిలో నివసించే సుదర్శన్, ఆయన భార్య సరుకుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై మక్తల్ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొన్నాడు. అంతలోనే వెనుక నుంచి వస్తున్న బస్సు చక్రం కింద పడి మృతి చెందాడు.
Accident: రెండు రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి.. అంతలోనే విషాదం
మరో రెండు రోజుల్లో పెళ్లి భాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురు వివాహానికి సరుకులు తీసుకొని వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మక్తల్లో రోడ్డు ప్రమాదం
మృతదేహాన్ని పోలీసులు మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజుల కిందటే మృతుడి తల్లి అనారోగ్యంతో మృతి చెందింజి. ఈ నెల 30న ఆయన కూతురు స్వాతి వివాహం ఉండటంతో సరుకుల నిమిత్తం మక్తల్ పట్టణానికి వచ్చారని ఇంతలోనే ఇలా జరిగిందని కుటుంబీకులు వాపోయారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Maoist arrest: ముగ్గురు మావోయిస్టు సభ్యులు అరెస్ట్