తెలంగాణ

telangana

ETV Bharat / crime

నకిలీ పాస్​పుస్తకాలతో బ్యాంకుకు టోకరా - peddapally district farmers

పెద్దపల్లి జిల్లాలో నకిలీ పాసు పుస్తకాలను పెట్టి బ్యాంకును అధికారులను రైతులు మోసం చేశారు. ఈ ఘటనలో కోటి 99 లక్షల 89వేల 714 రూపాయలు మోసం చేసినట్టు అధికారులు నిర్ధరణ చేశారు.

Peddapalli district Telangana rural Bank farmers put fake pass books in the bank basket.
నకిలీ పాస్​పుస్తకాలతో బ్యాంకుకు టోకరా

By

Published : Feb 4, 2021, 5:15 PM IST

పెద్దపల్లి జిల్లా.. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నకిలీ పాసు పుస్తకాలతో రుణాలను తీసుకుని రైతులు బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టారు. పెద్దపల్లి జిల్లాలోని రామగిరి, ముత్తారం మండలాలకు చెందిన 153 మంది రైతులు 2016 సంవత్సరం నుంచి 2018 వరకు సెంటినరీ కాలనీలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పంట రుణాలు తీసుకున్నారు. రైతులు రుణాలు చెల్లించకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. ఒక్క రైతు కూడా తిరిగి చెల్లించకపోవటంతో విచారణ చేపట్టారు. కొవిడ్​ కారణంగా ఆలస్యమైన దర్యాప్తులో రైతులు ఇచ్చిన పుస్తకాలు నకిలీవిగా గుర్తించారు.

నిర్ధారణ చేసుకున్నారు..

రెవెన్యూ అధికారి ఇచ్చిన సమాచారంతో గ్రామీణ బ్యాంకు అధికారులు నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతుల వద్దకు నేరుగా వెళ్లి విచారించారు. మొత్తంగా రూ. 1 కోటి 99 లక్షల 89 వేల 714 రూపాయలు మోసం చేశారంటూ నిర్ధారణ చేసుకున్నారు. గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు 153 మంది రైతులపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:అర్ధనగ్నంగా చిన్నారి మృతదేహం

ABOUT THE AUTHOR

...view details