తెలంగాణ

telangana

ETV Bharat / crime

బ్యాంకులో చోరీకి గురైన సొమ్ము విలువ రూ.3.10 కోట్లు: సీపీ - తెలంగాణ నేర వార్తలు

స్టేట్ ​బ్యాంక్​ ఆఫ్​ ఇండియా గుంజపడుగు శాఖ కార్యాలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి చొరబడిన దుండగులు రూ. 3.10 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు.

chory in sbi branch, bank robbery
robbery in sbi, gunjapadugu sbi chory

By

Published : Mar 25, 2021, 6:07 PM IST

పెద్దపల్లి జిల్లా గుంజపడుగు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దొంగతనం సంచలనం రేకెత్తించింది. అర్ధరాత్రి సమయంలో భవనం కిటికీ తొలగించి చొరబడిన దుండగులు రూ.18.40 లక్షలు, 6 కిలోల బంగారం ఎత్తుకెళ్లారని సీపీ సత్యనారాయణ తెలిపారు. మొత్తం ఎత్తుకెళ్లిన సొత్తు విలువ రూ.3.10 కోట్లు ఉంటుందని వెల్లడించారు. చోరీకి సంబంధించి ఘటనాస్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. దుండగలు సీసీ కెమెరా డీవీఆర్​లతో పాటు... అలారం మోగకుండా బ్యాటరీలు ఎత్తుకెళ్లారని సీపీ తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు 8 మంది పోలీసుల బృందం దర్యాప్తు చేస్తోందన్నారు.

మరోవైపు న్యాయవాద దంపతుల హత్య అనంతరం గ్రామంలో పోలీసు పికెటింగ్, పహరా పెంచామని పోలీసులు చెబుతుండగా.. అదే గ్రామంలో అర్ధరాత్రి దొంగలు బ్యాంకు కిటికీ పగులగొట్టి దూరి దొంగతనానికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో పోలీసులు జాగిలాల సహాయంతో విచారణ చేపట్టారు. బ్యాంకు వెనుక భాగంలో నిచ్చెన వాడి దొంగతనానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. బస్టాండ్​కు సమీపంలోనే చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చూడండి:గుంజపడుగులో బ్యాంకు చోరీ.. హార్డ్ డిస్క్ మాయం

ABOUT THE AUTHOR

...view details