అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు మహిళలను గ్రామస్థులు చితకబాది గ్రామ పంచాయతీలో బంధించిన సంఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో జరిగింది. పిల్లల్ని ఎత్తుకెళ్లడానికి వచ్చారన్ని అనుమానంతోనే వారిని బంధించి పోలీసులకు అప్పగించామని స్థానికులు తెలిపారు.
పిల్లల్ని ఎత్తుకెళ్లేవారనుకున్నారు.. చితకబాదారు - కామారెడ్డి జిల్లా తాజా సమాచారం
పిల్లల్ని ఎత్తుకెల్లేవారని భావించి నలుగురు మహిళలను స్థానికులు చితకబాది గ్రామపంచాయతిలో బంధించిన ఘటన కామారెడ్డి జిల్లాలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని విడిపించారు. వివరాలు తెలుసుకుని పంపించారు.
ఉదయం 8 గంటల ప్రాంతంలో పెద్దమల్లారెడ్డి గ్రామంలోకి వచ్చిన నలుగురు మహిళలను స్థానికులు వివరాలడగ్గా తాము అడుక్కోవడానికి వచ్చామని చెప్పారు. పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చారని అనుమానించిన గ్రామస్థులు వారిని గ్రామ పంచాయతీలో బంధించి చితకబాదారు. అనంతరం గ్రామానికి చేరుకున్న పోలీసులు సదురు మహిళలను విడిపించారు. అనుమానిత మహిళలు కర్నూలు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. బాధితులు గ్రామాల్లో బుర్రకథలు చెప్పుకుంటూ సంచార జీవనం గడిపేవారని పేర్కొన్నారు. ఇటీవల సోషల్మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాల కారణంగానే ఈ తరహా దాడులు జరుగుతున్నాయని సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మెద్దని కోరారు.
ఇదీ చదవండి:సెల్ఫోన్ ఇవ్వలేదని తండ్రిని చంపిన కూతురు