తెలంగాణ

telangana

ETV Bharat / crime

Pedakakani Rape Case: ఐదేళ్ల బాలికపై అత్యాచారం.. వృద్ధుడి అరెస్ట్ - five year old girl Rape under Pedakakani police station

Pedakakani Rape Case: ఓ వృద్ధుడు.. ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజూ తన దుకాణానికి వచ్చే ఆ కామాంధుడు చిన్న పిల్ల అని కూడా కనికరించలేదు. చాక్లెట్లు, బిస్కెట్లు ఆశచూపి ఆ చిన్నారిపై లైంగికవాంఛ తీర్చుకున్నాడు. ఈ దుర్ఘటన ఏపీలోని గుంటూరులో చోటు చేసుకుంది.

Pedakakani Rape Case
బాలికపై అత్యాచారం

By

Published : Nov 22, 2021, 10:24 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఐదేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారం (rape case at Pedakakani Police Station) చేశాడు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న షేక్ సుబాని అనే వృద్ధుడిని పోలీసులు అరెస్ట్(Pedakakani Rape Case) చేశారు. బడ్డీ కొట్టు పెట్టుకొని, పిల్లలు తినే చిరుతిళ్లు అమ్ముతున్న సుబాని.. ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

స్థానికంగా నివాసముండే ఐదేళ్ల బాలిక.. చాక్లెట్లు, బిస్కెట్లు కొనుక్కోవడానికి రోజూ సుబాని బడ్డీ కొట్టు దగ్గరకు వెళ్తుంది. ఈ క్రమంలోనే తాజాగా దుకాణం వద్దకు వెళ్లింది బాలిక. ఆమెకు చాక్లెట్లు, బిస్కెట్లు ఆశచూపిను సుబాని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిన బాలిక.. కడుపు నొప్పి వస్తోందని కుటుంబసభ్యులకు తెలిపింది. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు(five year old girl Raped under Pedakakani police station) చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టి, నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details