కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 43 క్వింటాళ్ల బియ్యం, రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
కాగజ్ నగర్లో పీడీఎస్ బియ్యం పట్టివేత - తెలంగాణ వార్తలు
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందన్న పక్కా సమాచారంతో కాగజ్ నగర్ పట్టణంలోని బస్టాండ్ ప్రాతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. బియ్యాన్ని తరలిస్తున్న రెండు వాహనాలను పట్టుకుని.. 43 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
![కాగజ్ నగర్లో పీడీఎస్ బియ్యం పట్టివేత pds rice seize, Kagaznagar, kumaram bheem asifabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-04:34:53:1621163093-tg-adb-46-16-kzr-pds-biyyam-pattivetha-av-ts10034-16052021163116-1605f-1621162876-18.jpg)
pds rice seize, Kagaznagar, kumaram bheem asifabad
కాగజ్ నగర్ పట్టణంలో అక్రమ పీడీఎస్ బియ్యం రవాణా జరుగుతుందన్న పక్కా సమాచారంతో బస్టాండ్ ప్రాతంలో వాహన తనిఖీలు చేపట్టామని టాస్క్‌ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు. టైబ నగర్ కాలనీకి చెందిన ఫరూక్ వాహనంలో సుమారు 30 క్వింటాళ్లు, దహేగాం మండలం బిబ్రా గ్రామానికి చెందిన సుంకరి వెంకటేశ్ వాహనంలో 13 క్వింటాళ్ల బియ్యం లభించాయన్నారు. రెండు వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించి కేసులు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
ఇదీ చూడండి: స్కూటర్‌పై వచ్చి గొలుసు లాక్కెళ్లిన దుండగులు