పైశాచికత్వంతో కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన తండ్రిపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు పీడీ చట్టం ప్రయోగించి కటకటాలకు పంపారు. బంజారాహిల్స్ పరిధిలో నివసించే ఓ బాలిక ఏడాది కిందట ఇంట్లోంచి పారిపోయింది. ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదృశ్యం కింద కేసు నమోదు చేశారు. ఇటీవలే బాలిక ఇంటికి వచ్చింది.
సోదరి అడగడంతో వెలుగులోకి
ఇంటి నుంచి ఎందుకు పారిపోయావని ఆమె సోదరి అడగడంతో తండ్రి పలుమార్లు తనపై జరిపిన అత్యాచారాన్ని వెల్లడించింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో తాను ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు బాధిత బాలిక వివరించింది. వెంటనే బాలిక తల్లి, సోదరి కలిసి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. తాజాగా అతనిపై పీడీ యాక్టు నమోదు చేశామని నిందితునికి శిక్ష పడుతుందని సీఐ శివచంద్ర తెలిపారు.
ఇదీ చదవండి:పెళ్లి పత్రికలో పేర్ల గొడవ.. కత్తులతో దాడి