తెలంగాణ

telangana

ETV Bharat / crime

డెంటిస్ట్​ కిడ్నాప్​ కేసులో నవీన్​రెడ్డిపై పీడీ యాక్ట్​ - Kidnapping case of young woman in Aadibhat

Naveen Reddy
Naveen Reddy

By

Published : Feb 10, 2023, 5:55 PM IST

Updated : Feb 10, 2023, 7:04 PM IST

17:52 February 10

నవీన్‌రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన రాచకొండ సీపీ చౌహన్

PD Act against Naveen Reddy: హైదరాబాద్​లో సంచలనం రేకెత్తించిన దంత వైద్య విద్యార్థిని వైశాలి అపహరణ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్​ రెడ్డిపై పోలీసులు పీడీ యాక్ట్​ నమోదు చేశారు. ఇప్పటి వరకు నవీన్​రెడ్డిపై ఆదిభట్ల పీఎస్​లో 5 కేసులు నమోదు అయినట్లు పేర్కొన్న రాచకొండ సీపీ చౌహాన్​.. అతనిపై పీడీ యాక్ట్​ నమోదు చేసినట్లు అధికారంగా ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటికే నవీన్‌రెడ్డితో పాటు మరో 40 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. వైశాలి ఫొటోలు మార్ఫింగ్ చేసి నకిలీ ఖాతాలతో.. వాటిని నవీన్‌రెడ్డి షేర్ చేసినట్లు పేర్కొన్నారు.

Naveen Reddy Arrest In Dentist Kidnap Case : అమెరికా పెళ్లి సంబంధంరావడంతో హైదరాబాద్‌ మన్నెగూడకు చెందిన దంతవైద్యురాలికి గత సంవత్సరం డిసెంబర్​ 9న తల్లిదండ్రులు నిశ్చితార్ధం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్‌ రెడ్డి యువతిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్రపన్నాడు. ఇందుకోసం అనుచరులతోపాటు తన ప్రాంఛైజీ స్టాళ్లలో పనిచేసే 36మందిని ముందురోజు రాత్రి మన్నెగూడకు రప్పించాడు.

ఆమెకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారంటూ నమ్మించి అపహరణ ప్రణాళికను రచించాడని పోలీసులు తేల్చారు. నవీన్‌ రెడ్డి సహా అంతా అదే రోజు ఉదయం 11:30 గంటలకు.. మూడుకార్లు, ఓ డీసీఎంలో మన్నెగూడలోని యువతి ఉండే ఇంటికి చేరుకున్నారు. పథకం ప్రకారం కర్రలు, రాడ్లతో నిలిపి ఉంచిన కార్లను ధ్వంసం చేశారు. నవీన్‌ రెడ్డిని అడ్డుకోబోయిన యువతి తండ్రి, బాబాయ్‌పైనా వారు దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి సోఫా, ఫర్నీచర్‌ సహా ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు.

ఇది జరిగిన అనంతరం నవీన్​రెడ్డి గోవా వెళ్లిపోయాడు. పోలీసులు సెల్​ఫోన్ సిగ్నల్​​ ఆధారంగా నిందితుడిని పట్టుకొని హైదరాబాద్​ తీసుకొచ్చారు. నవీన్​రెడ్డి అరెస్టుకు కొద్ది గంటల ముందే ఓ వీడియో సామాజిక మాద్యామాల్లో తెగ చక్కర్లు కొట్టింది. అందులో నవీన్​రెడ్డి.. వైశాలిని ఎందుకు కిడ్నాప్​ చేయాలి అనుకున్నాడో వివరించాడు. "ఎంతోకాలంగా తామిద్దరం కలిసి తిరిగాం. ఆ యువతి తల్లిదండ్రులే మమ్మల్ని దూరం చేశారు. తాను సంపాదించిన సొమ్ముతో ఖరీదైన వస్త్రాలు, సౌందర్య ఉత్పత్తులు కొనుగోలు చేసింది.

సన్నిహితంగా ఉన్న మమ్మల్నిద్దర్నీ దూరం చేసేందుకు యువతి మేనమామ, తల్లి పన్నాగం వేశారు. 5-6 నెలలు తనను కలవకుండా దూరం చేశారు. ఇంటికెళ్లినా, కళాశాలకు వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించినా పోలీసు కేసుతో భయపెట్టారు. కొద్దిరోజులుగా ఆమెకు ఎన్నారై పెళ్లి సంబంధాలు వస్తున్నట్టు తెలిసింది. ఈ నెల 9న మన్నెగూడలోని యువతి ఇంట్లో నిశ్చితార్థం జరగబోతోందని 8వ తేదీ రాత్రి తెలిసింది. దాన్ని అడ్డుకొని ఆమెతో మాట్లాడాలనే ఉద్దేశంతో వెళ్లాను." అంటూ వివరించాడు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 10, 2023, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details