తన కుటుంబంపై అభిమానులతో అనుచిత వ్యాఖ్యలు చేయించిన పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) తెలిపారు. పవన్ కల్యాణ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. అభిమానుల దాడిలో తాను చనిపోతే పవన్ కల్యాణే కారణమని పేర్కొన్న పోసాని... ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడి వెళ్తున్న క్రమంలో పోసానిపై పలువురు పవన్ అభిమానులు దాడికి (Pawan fans attempt to attack on Posani) యత్నించారు.
Pawan fans attempt to attack on Posani : పోసానిపై దాడికి పవన్ అభిమానుల యత్నం
18:44 September 28
పోసాని కృష్ణమురళిపై దాడికి పవన్ అభిమానుల యత్నం
రేపు పవన్‌పై ఫిర్యాదు చేస్తా
అక్కడే ఉన్న పంజాగుట్ట పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోసానిని సురక్షితంగా పోలీసు వాహనంలో ఆయన నివాసానికి తరలించారు. చలన చిత్ర పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన పోసాని... పవన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు విమర్శలు చేశారు. పోసాని విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ అభిమానులు ఆయన వ్యక్తిగత ఫోన్‌కు దుర్భాషలాడుతూ సందేశాలు పంపించడం, మాట్లాడటం చేశారు. పవన్ అభిమానుల మాటలను తన కుటుంబపరువు తీసేలా ఉన్నాయని.... అభిమానులను పవన్ నియంత్రణలో పెట్టుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.
పోసానిపై ఫిర్యాదు చేస్తాం
జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలను... తెలంగాణ రాష్ట్ర జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఖండించారు. పోసానికి ఏమైనా ఇబ్బంది ఉంటే న్యాయపరంగా వెళ్లాలని... ఈ తరహాలో మాట్లాడడం సరికాదని ఆక్షేపించారు. ఆయన వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తలతో పాటు పవన్‌కల్యాణ్ అభిమానుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. పోసానిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలిరావడంతో హడావుడి నెలకొంది.