ఆదిలాబాద్ రిమ్స్ భవనంపై నుంచి దూకిన రోగి - telangana crime news
07:52 February 20
ఆదిలాబాద్ రిమ్స్ భవనంపై నుంచి దూకిన రోగి
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి... మూడో అంతస్తు నుంచి ఓ రోగి కిందకు దూకాడు. తీవ్ర గాయాలు కావటంతో... అతని పరిస్థితి విషమంగా మారింది. వైద్యులు అత్యవసర చికిత్సను... అందిస్తున్నారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యాయత్నమా లేక ప్రమాదమా..? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇదివరకే ఇలాంటి ఘటనలు రెండు చోటు చేసుకుని ఇద్దరు మృతిచెందగా.. తాజా ఘటన కలకలం రేపింది.
రోగి.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం రాంనాయక్ తండాకు చెందిన కాంబ్లే మాధవ్‌గా పోలీసులు గుర్తించారు. కాలేయం వ్యాధితో ఈనెల 18న ఉట్నూర్ ఆస్పత్రి నుంచి రిమ్స్‌కు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.
- ఇదీ చూడండి :న్యాయవాద దంపతుల కేసులో మలుపులు