వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కల్కొడ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదాని(rtc bus accident)కి గురైంది. సంగారెడ్డి నుంచి తాండూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. కల్కొడ చౌరస్తా వద్ద ఒక్కసారిగా బోల్తాపడింది(RTC bus rolled over). ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ ప్రయాణికులను మర్పల్లి ఆస్పత్రికి తరలించారు.
RTC bus accident : ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు
14:15 November 12
RTC bus accident : ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు..
అతి వేగమే కారణం..!
ప్రమాదానికి అతి వేగమే(over speed of bus) కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. కల్కొడ గ్రామం సమీపంలో రహదారి ఎత్తుపల్లాలను డ్రైవర్ అంచనా వేయలేకపోయాడు. అప్పటికే వేగంలో ఉన్న బస్సును కంట్రోల్ చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంలో.. ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతమంతా.. ప్రయాణికుల ఆర్తనాదాలతో మారుమోగింది.
ఇదీ చూడండి: