తెలంగాణ

telangana

ETV Bharat / crime

Attack on RTC driver: బస్సు ఆపలేదనే కోపంతో డ్రైవర్‌పై దాడి - తెలంగాణ వార్తలు

నల్గొండ జిల్లా డిండి మండలంలో దారుణం చోటు చేసుకుంది. బస్సు ఆపలేదనే కోపంతో ద్విచక్రవాహనంతో వెంబడించి మరీ డ్రైవర్‌పై దాడి(Attack on RTC driver) చేశాడు. తోటి ప్రయాణికులు వద్దని వారించినా వినకుండా కింద పడేసి కాలుతో తన్నాడు. డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Attack on RTC driver, passenger assault rtc driver
డ్రైవర్‌పై దాడి, ఆర్టీసీ డ్రైవర్‌పై ప్రయాణికుడి దాడి

By

Published : Jul 23, 2021, 12:31 PM IST

నల్గొండ జిల్లా డిండి మండలంలో బస్సు డ్రైవర్‌పై ప్రయాణికుడు చేయి చేసుకున్న(Attack on RTC driver) ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవరకొండ డిపోకు చెందిన బస్సు... అచ్చంపేట నుంచి దేవరకొండకు బుధవారం రాత్రి వెళ్తుండగా ఎర్రారం బప్‌స్టాప్‌ వద్ద ఎక్కేందుకు కాటికబండ తండాకు చెందిన రమేశ్‌నాయక్ ప్రయత్నించాడు. డ్రైవర్‌ పత్యానాయక్‌ బస్సు ఆపలేదని ఆగ్రహానికి గురైన రమేశ్‌నాయక్‌.. ద్విచక్రవాహనంపై వెంబడించాడు.

బస్సులోకి ఎక్కిన రమేశ్ నాయక్ డ్రైవర్‌పై దాడి చేశాడు. ఎందుకు కొడుతున్నావని తోటి ప్రయాణికులు ప్రశ్నించినా వినకుండా... మద్యం మత్తులో పత్యానాయక్‌పై చేయి చేసుకున్నాడు. కింద పడేసి కాలుతో తన్నాడు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పత్యానాయక్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

బస్సు ఆపలేదనే కోపంతో డ్రైవర్‌పై దాడి

ఇదీ చదవండి:కృష్ణా నదిలో దూకిన కుటుంబం.. బాలుడి మృతదేహం లభ్యం

ABOUT THE AUTHOR

...view details