రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తల్లిదండ్రులు కొడుకుని చితకబాది ఇంటికి తీసుకెళ్లారు. పెద్దపల్లి జిల్లా ముంజపల్లి గ్రామానికి చెందిన వంగ మహేశ్ అనే యువకుడు గత రెండు నెలలుగా కనిపించకుండా పోయాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీశారు. ఎక్కడా కనిపించకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంతలో వారి కుమారుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు వేములవాడలో మహేశ్ కోసం వెతికారు. ఓ చోట అతన్ని చూసి షాకయ్యారు. తమ ముందు పాయింట్, షర్ట్ వేసుకుని అందరితో కలిసిమేలసి ఉండే అతను వారికి హిజ్రాగా కనిపించాడు. మహేశ్‌ను తమ వెంట రావాలని తల్లిదండ్రులు, బంధువులు కోరారు. దానికి అతడు నిరాకరించటంతో ఆగ్రహించిన వారు మహేశ్‌ను చితకబాది ఇంటికి తీసుకెళ్లారు.