కత్తులు, గొడ్డళ్లతో బెదిరించి సినీ ఫక్కీలో యువతిని బలవంతంగా తీసుకెళ్లిన ఘటన జగిత్యాల గ్రామీణ మండలంలో కలకలం రేపింది. బాలపల్లికి చెందిన జక్కుల మధు, రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన ఓ యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో యువతి మేజర్ కావడంతో 3 నెలల క్రితం ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు.
కులాలు వేరని కత్తులతో బెదిరించి.. సినీఫక్కీలో యువతిని తీసుకెళ్లిన తల్లిదండ్రులు
కత్తులు, గొడ్డళ్లతో బెదిరించి సినీ ఫక్కీలో యువతిని బలవంతంగా తీసుకెళ్లిన ఘటన జగిత్యాల గ్రామీణ మండలంలో కలకలం రేపింది. బాలపల్లికి చెందిన జక్కుల మధు, రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన అక్షర అనే యువతిని ప్రేమించి నాలుగు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి ఇష్టంలేని యువతి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు.
కులాలు వేరని కత్తులతో బెదిరించి.. యువతిని తీసుకెళ్లిన తల్లిదండ్రులు
అప్పటి నుంచి యువతి మధుతోనే అత్తారింట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం యువతి కుటుంబసభ్యులు, బంధువులు కత్తులు, గొడ్డళ్లతో మధు ఇంటికి చేరుకుని దాడికి యత్నించారు. యువతిని బలవంతంగా కారులో తీసుకెళ్లారు. బాధితుడు మధు ఫిర్యాదు మేరకు యువతి తండ్రితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ తెలిపారు.
ఇవీ చదవండి: