Parents suicide attempt due to love marriage : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చెన్నారంలో ఓ ప్రేమ వివాహం కన్నవాళ్ల ప్రాణాల మీదకు తెచ్చింది. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులకు మనస్తాపానికి గురయ్యారు. వద్దని వారించినా... కడుపున పుట్టిన బిడ్డ చెప్పిన మాట వినలేదని కుంగిపోయారు. ఇక బతికి ఉండడమే వ్యర్థం అనుకున్నారేమో... భార్యాభర్తలిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.
చెన్నారం గ్రామానికి చెందిన శ్రావణి, రాకేష్ ప్రేమించుకొని... పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లికి శ్రావణి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయినా కూడా పెళ్లి చేసుకున్నారు. కూతురి ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేకపోయిన శ్రావణి తల్లిదండ్రులు... కుమారస్వామి, కవిత పురుగుల మందు తాగారు.