నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మడమడక గ్రామంలో విషాదం నెలకొంది. పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న తౌర్య నాయక్(49) కార్యాలయంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య(Panchayat secretary suicide) చేసుకున్నారు. మృతుడి జేబులో ఉన్న సూసైడ్ నోట్‌ను దేవరకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తౌర్య నాయక్ కుటుంబ, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ బీసన్న వెల్లడించారు.
Panchayat secretary suicide: కార్యాలయంలోనే ఉరేసుకున్న పంచాయతీ కార్యదర్శి... అసలేం జరిగింది? - తెలంగాణ వార్తలు
19:36 November 15
కార్యాలయంలోనే ఉరేసుకున్న పంచాయతీ కార్యదర్శి
సోమవారం మధ్యాహ్నం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యదర్శుల సమావేశానికి తౌర్య హజరు కాలేదు. 3.30గంటల సమయంలో పంచాయతీ కార్యదర్శి తన కార్యాలయంలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని(Panchayat secretary suicide) కనిపించాడు. అది గమనించిన గ్రామస్థులు దేవరకొండ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్‌ఐ రామాంజనేయులు... తౌర్య జేబులో ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని గ్రామస్థుల సహకారంతో మృతదేహాన్ని కిందికి దించారు. పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. తౌర్య నాయక్ మృతిపట్ల దేవరకొండ ఎంపీడీవో శర్మ సంతాపం తెలిపారు.
2002 నుంచి తౌర్య నాయక్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. దేవరకొండ, కొండమల్లేపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసి అందరి మన్ననలు పొందారు. తౌర్య నాయక్ ఆత్మహత్య(Panchayat secretary suicide)చేసుకున్నాడని సమాచారం... అందడంతో ఆయన స్వగ్రామమైన నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తౌర్య నాయక్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ప్రవీణ్ బీటెక్ పూర్తి చేశాడు. కుమార్తె ప్రవళిక ఒకటో తరగతి చదువుతోంది.
ఇదీ చదవండి:student suicide video: కళాశాల భవనంపై నుంచి దూకి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య... ఆ భయంతోనే..