తెలంగాణ

telangana

ETV Bharat / crime

Palvancha Family suicide : రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో విడుదల - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

Palvancha Family suicide,   Ramakrishna another selfie video
బాధితుడు రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో విడుదల

By

Published : Jan 8, 2022, 7:15 AM IST

Updated : Jan 8, 2022, 9:54 AM IST

07:04 January 08

బాధితుడు రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో విడుదల

బాధితుడు రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో విడుదల

Palvancha Family suicide : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పాల్వంచ ఆత్మహత్య కేసులో మరో కీలక వీడియో లభించింది. బాధితుడు రామకృష్ణ ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డు చేసిన మరో వీడియో తాజాగా బయటకు వచ్చింది. రాఘవతో పాటు తన తల్లి, సోదరి కారణంగా ఆస్తుల పంపకం విషయంలో ఎంతో క్షోభ అనుభవించానంటూ పలు వివరాలను ఆయన వీడియోలో చెప్పారు. తన బలవన్మరణానికి సూత్రధారి రాఘవేనని రామకృష్ణ ఆరోపించారు. తండ్రి ద్వారా న్యాయంగా రావాల్సిన ఆస్తిని అడ్డుకున్నారన్న రామకృష్ణ.. తనకు అప్పులిచ్చిన వారికి అన్యాయం చేయవద్దని వేడుకున్నారు.

‘నా నాన్న పేరు మండిగ చిట్టబ్బాయి. తూర్పుగోదావరి జిల్లా మోతుగూడెంలో ఆరోగ్య శాఖలో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. 1992లో నేను 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి మా నాన్న మృతిచెందారు. మీరు ఈ వీడియో చూసే సమయానికి నేను బతికి ఉంటాననో లేదో తెలీదు. నా పరిస్థితికి సూత్రధారి రాఘవ. నా అక్క మాధవి, మా తల్లి సూర్యవతి సహకరించారు. 20 ఏళ్లుగా మా అక్కతో వనమా రాఘవకు వివాహేతర సంబంధం ఉంది. ఈ ముగ్గురూ కలిసి తండ్రి ద్వారా న్యాయబద్ధంగా నాకు రావాల్సిన ఆస్తిని అడ్డుకున్నారు. అమ్మ రిటైరయ్యే ముందు 2020 నవంబరులో పెద్దమనుషుల సమక్షంలో వాటాలు తేల్చుకున్నాం.

-రామకృష్ణ, బాధితుడు

ఏడాది నుంచి వాటాలు పంచకుండా నా పరిస్థితిని చావుదాకా తీసుకొచ్చారు. మా సొంత స్థలం పోలవరం మండలం పాత పట్టిసీమ. మా స్వస్థలానికి ఏ సంబంధం లేని రాఘవ ఆస్తి పంపకాల విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. అక్కకు పోలవరంలో రెండు ఎకరాలు, రాజమండ్రిలో రెండు ఇళ్ల స్థలాలు, గోకవరంలో 200 గజాల స్థలం, అమ్మ రిటైర్‌మెంట్‌ డబ్బులో కూడా వాటా ఇచ్చాం. నేను రాజమండ్రిలో అద్దె ఇల్లులో ఉంటున్నా. ఇద్దరు ఆడపిల్లలు. వారి చదువులు, కుటుంబం గడవడానికి సంపాదించుకోవాలి. సుమారు రూ.30లక్షలు అప్పులు అయ్యాయి. న్యాయం జరగదనే కుటుంబంతో సహా బలవన్మరణానికి పాల్పడుతున్నా. నాకు అప్పులిచ్చిన వారికి అన్యాయం చేయొద్దు.’

-రామకృష్ణ, బాధితుడు

Last Updated : Jan 8, 2022, 9:54 AM IST

ABOUT THE AUTHOR

...view details