తెలంగాణ

telangana

ETV Bharat / crime

Rape attempt on beggar: భిక్షాటన చేసే పాపపై పెయింటర్​ అత్యాచారయత్నం.. - beggar girl

Rape attempt on beggar: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కీచకుడు ఓ చిన్నారిపై బలాత్కారానికి తెగబడ్డాడు. భిక్షాటన చేస్తున్న పాప అని కూడా చూడకుండా.. మదమెక్కిన ఆంబోతులా ఆమెను చెరపబోయాడు. ఈ అమానవీయ ఘటన కామారెడ్డిలో జరిగింది.

painter Rape attempt on minor beggar girl at Kamareddy
painter Rape attempt on minor beggar girl at Kamareddy

By

Published : Feb 8, 2022, 3:36 PM IST

Rape attempt on beggar: ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఎన్ని కఠినమైన శిక్షలు విధిస్తోన్నా.. సమాజంలో మగాళ్లు మృగాళ్లుగా మారుతూనే ఉన్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి.. అమ్మాయి అయితే చాలు మదమెక్కిన ఆంబోతుల్లా తెగబడిపోతున్నారు. పాపం పాప అని జాలిపడి సాయం చేయాల్సింది పోయి.. దిగజారిపోయి భిక్షాటన చేస్తున్న చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడు ఓ ప్రబుద్ధుడు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పట్టణంలో రామారెడ్డి రోడ్డులో భిక్షాటన చేసే బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి యత్నించాడు. రామారెడ్డికి చెందిన కనకయ్య అనే పెయింటర్.. కామంతో కళ్లు మూసుకుపోయి మనవరాలి వయసుండి భిక్షాటన చేస్తున్న బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు కనకయ్యను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం కనకయ్యను పోలీసులకు అప్పగించారు.

భిక్షాటన చేసే పాప.. నిజామాబాద్​కు చెందిన అమ్మాయిగా గుర్తించారు. తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవటం వల్ల.. బాలిక భిక్షాటన చేస్తున్నట్టుగా స్థానికులు వివరించారు. కనకయ్య.. భవనాలకు రంగులు వేస్తూ జీవనం సాగిస్తుంటాడు. గతేడాది ఐదో నెలలో కనకయ్య భార్య చనిపోయినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details