అర్ధరాత్రి 2.30 గంటల సమయం.. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా ఢామ్ అని శబ్ధం. బాంబ్ పేలిందేమోనని నిద్రలో నుంచి అంతా ఉలిక్కిపడి లేచారు. చూస్తే తమ పక్క బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. దాదాపు రెండు అంతస్తులు దెబ్బతిన్నాయి. తలా ఓ చేయి వేసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటల వ్యాప్తి పెరగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. ప్రమాదానికి కారణం ఆక్సిజన్ సిలిండర్ పేలడమేనని గుర్తించారు.
ఆక్సిజన్ సిలిండర్ బ్లాస్ట్..
హైదరాబాద్ పాతబస్తీలోని మొఘల్‌పురా హరిబౌలిబేలా కాలనీలో బ్లాక్ నంబర్-14లో ఉన్న ఇంట్లో అర్ధరాత్రి 2.30 గంటలకు ఆక్సిజన్ సిలిండర్ పేలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనతో భవనంలోని రెండు అంతస్తులు దెబ్బతిన్నాయి కానీ ఎవరికీ ప్రమాదం జరగలేదు.