తెలంగాణ

telangana

ETV Bharat / crime

అమానవీయం.. కుమార్తెపై మూడేళ్లుగా అత్యాచారం - కన్నకూతురినే కాటేసిన కామాంధుడు

కామంలో కళ్లుమూసుకుపోయి.. కన్నకూతురన్న విషయాన్ని మరిచాడు. రక్తం పంచుకుపుట్టిన కూమార్తె పట్ల రాక్షసుడిలా మారాడు. తండ్రి అనే పదమే చీదరించుకునేలా తోడేలై ప్రవర్తించాడు. కాపాడాల్సినవాడే కామాంధుడై కాటేశాడు. అన్నింటా తోడుంటాననే నమ్మకాన్ని ఇవ్వాల్సిన నాన్నే.. నరరూపమృగాడై నరకం చూపించాడు. తండ్రీకూతుళ్ల బంధమే కన్నీళ్లు పెట్టుకునే ఈ అమానవీయ ఘటన మర్పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

OWN FATHER RAPED HIS DAUGHTER IN MARPALLI, VIKARABAD DISTRICT
అమానవీయం.. కుమార్తెపై మూడేళ్లుగా అత్యాచారం

By

Published : Mar 29, 2022, 9:23 AM IST

కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. డీఏస్పీ సత్యనారాయణ, సీఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ కుగ్రామానికి చెందిన నిందితుడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి ఆమెతో విడిపోగా రెండో భార్య చనిపోయింది. మూడో సంబంధానికి ఓ కుమారుడు, కుమార్తె. భార్యకు మతిస్థిమితం లేదు. కుమార్తె (15)పై మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని కుటుంబంతో పరిచయం కొనసాగిస్తున్న నిందితుడి మొదటి భార్యకు బాధితురాలు ఫోన్‌ చేసి చెప్పింది. ఆమె సూచనతో డయల్‌ 100కు సమాచారం ఇచ్చింది. పోలీసులు స్పందించి తండ్రిని సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు డీఏస్పీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details