Pedda amberpet road accident: ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టిన ఘటన రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట బాహ్య వలయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా, లారీ పాక్షికంగా దగ్ధం అయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారుడు కారులో మంటలను చూసి డ్రైవర్‌ను బయటకి తీయడంతో ప్రమాదం తప్పింది. హయత్‌నగర్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. డ్రైవర్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.
శంషాబాద్ నుండి ఘట్‌కేసర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈసీఐఎల్ దమ్మాయిగూడాకు చెందిన మయూర్... శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లి తిరిగి వస్తుండగా సిమెంట్ లోడుతో ఉన్న లారీని వెనక నుండి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.